ధర్మవరం పట్టణ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం ధర్మవరం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు కళాజ్యోతి సర్కిల్ వద్ద అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా అగ్ని ప్రమాదాలను ఎదుర్కోవాలి అనే అంశంపై అగ్నిమాపక శాఖ సిబ్బంది ఫైర్ ఇంజన్ తోను, మంటలతోనూ విన్యాసాలు చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారి రాజు పాల్గొన్నారు.