ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి వైసీపీ బస్సు యాత్ర వివరాలని అందించిన తలశిల రఘురాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 29, 2024, 11:07 AM

మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం (మార్చి 29) కర్నూలు జిల్లా పెంచికలపాడు లోని రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో భాగంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రివర్యులు  వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి గారు ఉదయం 9 గంటలకు పెంచికలపాడు నుంచి రామచంద్రపురం, కోడుమూరు, హంద్రీ కైరవడి, గోనెగండ్ల మీదుగా రాళ్లదొడ్డి  చేరుకుంటారు. రాళ్లదొడ్డికి ముందు భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కడిమెట్ల మీదుగా ఎమ్మిగనూరులోని  వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్ దగ్గర బహిరంగ సభలో సాయంత్రం 3 గంటలకు పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం అరెకల్, ఆదోని క్రాస్, విరుపాపురం,బెణిగేరి,ఆస్పరి, చిన్నహుల్తి,పత్తికొండ బైపాస్ మీదుగా కేజీఎన్ ఫంక్షన్ హాల్ కి దగ్గరలో ఏర్పాటు చేయబడిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటార‌ని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com