తుఫాను దిశను మార్చుకుంటోంది: డిప్యూటీ సీఎం

  Written by : Suryaa Desk Updated: Sun, Dec 16, 2018, 02:09 PM
 

తుఫాను దిశను మార్చుకుంటోందని డిప్యూటీ సీఎం చినరాజప్ప అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ పెథాయ్‌ తుఫాను కాకినాడ, వైజాగ్‌ మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 14 మండలాలు ప్రభావితమవుతాయన్నారు. నిత్యావసర సరుకులు అన్ని అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. హెలికాప్టర్లు కూడా సిద్ధం చేశామన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో ఉన్నాయని పేర్కొన్నారు. తుఫాన్‌ తీవ్రతను బట్టి 72 ఆవాసాలను ఖాళీ చేసే అవసరం పరిశీలిస్తామన్నారు.