అగ్రిగోల్డ్‌ కేసు తాజా పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్ష

  Written by : Suryaa Desk Updated: Sun, Dec 16, 2018, 02:06 PM
 

అమరావతి: అగ్రిగోల్డ్‌ కేసు తాజా పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. కేసు వివరాలను సీఎం చంద్రబాబు అడ్వకేట్‌ జనరల్‌ని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు పరిహారం అందించే ప్రక్రియ వేగవంతం చేయాలని ఏజీకి చంద్రబాబు సూచించారు. అగ్రిగోల్డ్‌ ఆస్తుల అమ్మకం వేగవంతం చేసి వెంటనే బాధితులకు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.