తుదిశ్వాస వదిలేలోపు సమాజంలో ఎంతోకొంత మార్పు తీసుకొస్తా: పవన్

  Written by : Suryaa Desk Updated: Sun, Dec 16, 2018, 01:29 PM
 

డల్లాస్: అమెరికా పర్యటనలో ఉన్న జనసేనాని అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డల్లాస్‌లో డాక్టర్లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు రాజకీయం తెలియదని.. మానవత్వం మాత్రమే తెలుసునని అన్నారు. డబ్బుతో సమాజంలో మార్పు సాధ్యం కాదన్నారు. తుదిశ్వాస వదిలేలోపు సమాజంలో ఎంతోకొంత మార్పు తీసుకొస్తానన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. హార్వర్డ్ నుండి డాక్టర్లను పిలిపించామన్నారు. కానీ, ఈ రాజకీయ వ్యవస్థలో కిడ్నీ సమస్య పరిష్కారం దిశగా ముందుకు తీసుకెళ్లలేకపోయామని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్ధానం సమస్య పరిష్కారానికి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని భావించినట్లు చెప్పారు. వైద్యులను భగవంతుడితో సమానంగా భావిస్తున్నమని, డాక్టర్లను జనసేన పార్టీ గుండెల్లో పెట్టుకొని చూసుకొంటుందని పవన్ పేర్కొన్నారు.