రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఎస్‌ఐ ప్రాథమిక రాత పరీక్ష

  Written by : Suryaa Desk Updated: Sun, Dec 16, 2018, 11:48 AM
 

అమరావతి:  రాష్ట్ర వ్యాప్తంగా ఎస్‌ఐ ప్రాథమిక రాత పరీక్ష ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 7 నగరాల్లో ఏర్పాటు చేసిన 240 పరీక్షా కేంద్రాలలో పరీక్ష నిర్వహిస్తున్నారు. ప్రాథమిక రాత పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పేపర్‌-1 పరీక్ష మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. పేపర్‌-2 పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ప్రారంభమై సాయంత్రం 5.30 గంటల వరకు జరగనుంది. ఎస్‌ఐ రాత పరీక్ష లక్షా 24వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.