పెథాయ్‌ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి నారాయణ

  Written by : Suryaa Desk Updated: Sun, Dec 16, 2018, 11:05 AM
 

నెల్లూరు:  పెథాయ్‌ తుఫాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారాయణ అన్నారు. పెథాయ్‌ నేపథ్యంలో మున్సిపల్‌ అధికారులతో మంత్రి నారాయణ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కోవడానికి అధికారులకు మంత్రి నారాయణ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి మున్సిపాలిటీ పరిధిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ఉడ్‌కట్టర్లు, జనరేటర్లు, వాటర్‌ ట్యాంకులు, డీజిల్‌ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అత్యవసరంగా ఆహారం అందించడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. తుఫాన్‌ ప్రభావం కలిగిన గంటల్లోనే సహాయక చర్యలు ప్రజలకు అందాలన్నారు.