ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన మంత్రి సునీత

  Written by : Suryaa Desk Updated: Fri, Dec 14, 2018, 03:11 PM
 

అనంతపురం: కురుగుంట గ్రామంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏపీ మంత్రి పరిటాల సునీత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని గైనకాలజీ వార్డులో తిరిగి గర్భిణీ స్తీలకు అందుతున్న వైద్య సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్న వైద్యం, సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి.. 11 సబ్ సెంటర్లకు చెందిన ఆశా వర్కర్లతో మాట్లాడి వారికి పలు సూచనలు చేశారు.