దినకరన్ కు సుప్రీంకోర్టులో ఊరట

  Written by : Suryaa Desk Updated: Fri, Dec 14, 2018, 02:36 PM
 

అన్నాడీఎంకే బహిష్కృత నేత, శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అన్నాడీఎంకే పార్టీకి చెందిన రెండాకుల గుర్తు కోసం ఈసీ అధికారులకు లంచం ఇవ్వజూపారనే ఆరోపణలపై నేరపూరిత కుట్ర అభియోగాలు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై పాటియాల కోర్టులో జరుగుతున్న విచారణను జనవరి 29 వరకు ఆపాలని స్టే విధించింది. రెండాకుల గుర్తు తమకు కేటాయించేలా దినకరన్‌ మరో వ్యక్తితో కలిసి ఎన్నికల కమిషన్‌ను భారీగా లంచం ఇవ్వజూపినట్లు గతేడాది ఆరోపణలు వచ్చాయి. దీంతో 2017 ఏప్రిల్‌లో దినకరన్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ చేపట్టిన ఢిల్లీ కోర్టు దినకరన్‌పై అభియోగాలు నమోదు చేసింది.