మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం

  Written by : Suryaa Desk Updated: Tue, Dec 11, 2018, 08:43 AM
 

న్యూఢిల్లీ : రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్  రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ 22 స్థానాల్లో ముందుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల్లో దూసుకుపోతోంది. మొత్తంమీద మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ జోరు ఫలితాల్లో కనిపించింది.