ఏయూలో తొలగించిన ఉద్యోగులను మళ్లీ చేర్చుకుంటాం : మంత్రి గంటా

  Written by : Suryaa Desk Updated: Mon, Dec 10, 2018, 03:04 PM
 

ఏయూలో పదవుల నుంచి తొలగించిన ఉద్యోగులను మళ్లీ చేర్చుకుంటామని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం మీడియాతో  ఆయన మాట్లాడుతూ… కాంట్రాక్ట్‌ ఉద్యోగుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి గంటా స్పష్టం చేశారు.  కాంట్రాక్ట్‌ ఉద్యోగులను అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. ఎన్‌ఎంఆర్‌ డిపార్ట్‌మెంట్‌లో కొన్ని సమస్యలు ఉన్నాయని, త్వరలో పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు.