కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌పై శశిథరూర్‌ కేసు

  Written by : Suryaa Desk Updated: Mon, Dec 10, 2018, 02:44 PM
 

  తిరువనంతపురం : ఒక హత్య కేసులో నిందితుడిగా వ్యాఖ్యానించడంపై బిజెపి మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌పై కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌ పరువునష్టం కేసును దాఖలు చేశారు. శశి థరూర్‌ తన భార్య సునంద పుష్కర్‌ హత్య కేసులో విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తనను నిందితుడిగా చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఒక లీగల్‌ నోటీసును పంపారు. కాగా, థరూర్‌ ప్రధాని మోడీ కి వ్యతిరేకంగా చేసిన ట్వీట్‌ను తొలగించేందవరకు తాను క్షమాపణలు చెప్పే ప్రశ్నే లేదని ప్రసాద్‌ తెలిపారు.