తెలంగాణ ఫలితాల ఎఫెక్ట్‌ ఏపీలో ఉండదు..

  Written by : Suryaa Desk Updated: Mon, Dec 10, 2018, 02:27 PM
 

తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీ ఎన్నికలపై అస్సలు ప్రభావం చూపవని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పై వ్యతిరేకత తీవ్రస్థాయిలో వుందన్నారు. ఢిల్లీలో ఏర్పడే ఏ కొత్త కూటమిలోనూ వైసీపీ చేరబోదన్న బొత్స.. ఇప్పుడు ఏర్పడుతున్న కూటమిని చంద్రబాబు తన అవసరాలకోసమే వాడుకుంటున్నారని ఆరోపించారు. ఇక్కడ ఫలితాలు నెక్ టూ నెక్ నడుస్తున్నాయని ఆయన చెప్పారు.