మమతతో చంద్రబాబు భేటీ...

  Written by : Suryaa Desk Updated: Mon, Dec 10, 2018, 02:14 PM
 

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... ఢిల్లీలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. న్యూఢిల్లీలోని సౌత్ ఎవెన్యూలో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. కాగా, బీజేపీయేతర పక్షాల సమావేశంలో పాల్గొనడానికి ఇవాళ ఉదయం అమరావతి నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకున్నారు చంద్రబాబు. మధ్యాహ్నం బీజేపీయేతర పక్షాల సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే.