అదుపుత‌ప్పి పొలాల్లోకి దూసుకుపోయిన బ‌స్సు

  Written by : Suryaa Desk Updated: Mon, Dec 10, 2018, 12:58 PM
 

జిల్లా కేంద్రంలోని నూజివీడు ఆర్టీసి డిపోకి చెందిన బస్సు అదుపు తప్పి మొక్కజొన్న పోలాల్లోకి దూసుకుపోయింది.నూజివీడు నుంచి లోపూడి బయలుదేరిన బస్సు తిరిగి నూజివీడు వ‌స్తుండ‌గా మార్గమద్యంలో చెక్కపల్లి సమీపంలో ఈ ప్ర‌మాదం జరిగింది.ఈ బస్సులో నూజివీడుకి వెళ్లే 50మంది విథ్యార్థులు ప్ర‌యణిస్తున్నారు.డ్రైవర్ సమయ‌స్పూర్తిలో వ్యవహ‌రించటం వలన ఘోర ప్రమాదం తప్పింది.బస్సు స్టీరింగ్ ప‌ట్టేయ‌డంతో అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగిందని బస్సు డ్రైవర్ చెప్పారు.