భారీగా పెరిగిన తాజ్ మహల్ ఎంట్రీ టికెట్ ధర

  Written by : Suryaa Desk Updated: Mon, Dec 10, 2018, 12:26 PM
 

అద్భుత కట్టడం తాజ్ మహల్ ను వీక్షించాలనుకునేవారు ఇకపై ఎంట్రీ టికెట్ కోసం భారీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అదనంగా రూ. 200 చెల్లించాలి. పెరిగిన ధరలు ఈరోజు నుంచే అమల్లోకి వచ్చాయి. దేశీయ టూరిస్టులకు ఇప్పటి వరకు ఎంట్రీ టికెట్ రూ. 50గా ఉంది. ఈరోజు నుంచి మనం రూ. 250 చెల్లించాలి. విదేశీ టూరిస్టుల టికెట్ ధర రూ. 1,300లకు పెరిగింది. సార్క్ దేశాల నుంచి వచ్చే టూరిస్టుల టికెట్ ధర రూ. 540 నుంచి రూ. 740కి పెరిగింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చీఫ్ ఆర్కియాలజిస్ట్ వసంత్ స్వర్ణాకర్ ఈ వివరాలను వెల్లడించారు. రూ. 50 టికెట్ తీసుకున్న వారిని తాజ్ మహల్ ప్రధాన ప్రాంతం వద్దకు అనుమతించమని... తాజ్ ను వెనుకవైపు ఉన్న యమునానది రివర్ ఫ్రంట్ నుంచి వీక్షించేందుకు మాత్రమే అనుమతిస్తామని చెప్పారు.