కృష్ణానదీ జలాలపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

  Written by : Suryaa Desk Updated: Mon, Dec 10, 2018, 12:11 PM
 

కృష్ణానదీ జలాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కృష్ణా ట్రైబ్యునల్ లో నదీ పరివాహక 4 రాష్ట్రాల వాదనలు మొదట్నుంచీ వినాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. గతంలో ఇదే తరహాలో తెలంగాణ వేసిన పిటిషన్ ను తోసిపుచ్చామని ధర్మాసనం తెలిపింది. గతంలో ఏపీ విభజన చట్టం ప్రకారం విడిపోయిన తెలుగు రాష్ట్రాల మధ్య వాదనలు జరిగాయి. గతంలో వాదనలు సరిపోతాయని ట్రైబ్యునల్ తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ట్రైబ్యునల్ లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య యదావిధిగా వాదనలు కొనసాగనున్నాయి.