మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు అనుకూలంగా తీర్మానాలు

  Written by : Suryaa Desk Updated: Mon, Dec 10, 2018, 10:44 AM
 

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు అనుకూలంగా తీర్మానాలు ఆమోదించాలని కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆదేశించారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బిజెపిపై ఒత్తిడి పెంచే క్రమంలో రాహుల్‌ ఈ చర్య చేపట్టారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు, కాంగ్రెస్‌ పొత్తుతో నడుస్తున్న ప్రభుత్వాల ముఖ్యమంత్రులకు రాహుల్‌ లేఖ రాశారు. లోక్‌సభ, శాసనసభల్లో మహిళళకు మూడవ వంతు రిజర్వేషన్లు కల్పించాలని రూపొందించిన మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు ఆమోదం తెలుపుతూ తీర్మానాలు చేయాలని రాహుల్‌ కోరారు.