తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ రెండు పర్యాయాలు సీఎంగా పని చేయగా, తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సోషల్ మీడియాలో స్పందించారు."తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, మంత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అంటూ ముఖ్యమంత్రి జగన్ ట్వీట్ చేశారు.