తెలుగుదేశం పార్టీ పొత్తు, సీఎం పదవిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో జరిగిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఎక్కువ సీట్లు గెలిస్తే సీఎం పదవి అడగవచ్చని అన్నారు. సీఎం ఎవరన్నది ఆయన, చంద్రబాబు నిర్ణయిస్తారన్నారు. తాము తెలుగుదేశం పార్టీ వెనుక నడవడం లేదని, తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తున్నామన్నారు. తాము ఎవరికీ బి-పార్టీ కాదని స్పష్టం చేశారు. జనసైనికుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టనని హామీ ఇచ్చారు.