ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీకి మిచౌంగ్ తుఫాన్ ముప్పు,,,,హెల్ప్ లైన్‌లు ఏర్పాటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 04, 2023, 09:39 PM

నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా కదులుతున్న మిచౌంగ్ తుఫాన్ గంటకు 13 కి.మీ వేగంతో కదులుతోంది. ప్రస్తుతానికి చెన్నైకి 150 కి.మీ, నెల్లూరుకు 250 కి.మీ, బాపట్లకు 360 కి.మీ, మచిలీపట్నానికి 380కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇవాళ కోస్తా తీరానికి సమాంతరంగా తుఫాన్ పయనించనుంది. మంగళవారం మధ్యాహ్నం నెల్లూరు - మచిలీపట్నం మధ్య మిచౌంగ్ తీవ్ర తుఫాన్‌గా తీరం దాటనుంది. ఈ ప్రభావంతో నేడు,రేపు కూడ కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురువనున్నాయి. కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అతితీవ్రభారీ వర్షాలు కురుస్తాయి. రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వానలు పడతాయి. బుధవారం ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 80 -100 కీమీ, సాయంత్రం నుంచి గంటకు 90-110 కీమీ వేగంతో గాలులు వీస్తాయని.. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదన్నారు.


మరోవైపు మిచౌంగ్ తుఫాన్ హెచ్చరికలతో కృష్ణాజిల్లాలో యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నెంబర్లు 08672 252572, 08672 252000.. అలాగే కృష్ణాజిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. నేడు జరగాల్సిన సమ్మెటివ్ అసెస్మెంట్ 1 పరీక్ష వాయిదా వేశారు. మచిలీపట్నం ఆర్డీవో కార్యాలయంతో పాటు సముద్రతీర ప్రాంత మండలాల్లోని అన్ని తహసీల్దారు కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. అత్యవసర సహాయంతో పాటు వాతావరణ సమాచారం తెలుసుకునేందుకు వీలుగా 24 గంటల పాటు పనిచేసేలా 08672-252572, 252000 నంబర్లతో కలెక్టరేట్‌లో కమాండ్‌ కంట్రోల్‌రూం పనిచేస్తోంది. బలమైన గాలులతో విద్యుత్‌ స్తంభాలు పడిపోవడం, తీగలు తెగిపోయే అవకాశం ఉంటుందంటున్నారు అధికారులు. తెగి పడిన తీగలకు దూరంగా ఉండాలని.. గాలుల తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే గృహాల్లోని విద్యుత్తు పరికరాలు స్విచ్‌ ఆఫ్‌లో ఉంచాలన్నారు.


గుంటూరు జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ హెచ్చరికలు జారీ చేశారు. తుఫాన్ ప్రభావంతో జిల్లాలో ఈదురుగాలులు బలంగా వీచే అవకాశం ఉందని, అంతేకాకుండా భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయన్నారు. 0863-2234014 కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశామన్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు మరింత తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు, రైతులు పంటలు, ధాన్యాన్ని, పశువులను సురక్షితంగా కాపాడుకునే చర్యలు చేపట్టాలన్నారు. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే కంట్రోల్‌ రూంను సంప్రదించవచ్చన్నారు. సహాయక చర్యలకు 24 గంటలు పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక బలగాలను సిద్ధం చేశామన్నారు. తుఫాన్ కారణంగా ఏమైనా ఘటనలు తలెత్తినా, అత్యవసర పరిస్థితులు వచ్చినా ప్రజలు డయల్‌ 100కు, ప్రత్యేక పోలీసు కంట్రోల్‌ రూం 8688831568కు సమాచారం తెలిపితే సహాయక చర్యలు చేపడతామన్నారు.


మిచౌంగ్‌ తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి తెలిపారు. ప్రజల ఇళ్లలోకి నీరు ప్రవేశిస్తే వెంటనే బాధిత కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. ప్రమాదకరంగా నీరు ప్రవహించే ప్రాంతాల్లో రాకపోకలను పూర్తిగా నిషేధించాలని పోలీసులకు సూచించారు. అత్యవసరమైతే ప్రజలు కలెక్టరేట్‌లోని కంట్రోల్‌రూమ్‌ నంబరు 0877-2236007ను సంప్రదించాలన్నారు.


కంట్రోల్‌ రూమ్‌లు


శ్రీకాళహస్తి: 97041 61120


సూళ్లూరుపేట: 94907 39223


గూడూరు: 08624- 252807


తిరుపతి: 94910 77012


అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పోలీసులు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి సూచించారు. జేసీబీలు అందుబాటులో ఉంచుకుని అవసరమైనచోట పూడికతీసి నీటిని తరలించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్‌ 100, 80999 99977 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.


మిచౌంగ్ తుఫాన్ నేపధ్యంలో విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. 13 స్టేషన్లలో హెల్ప్ లైన్లు ఉన్నాయి..


ఒంగోలు - 08592-280306


కాకినాడ టౌన్ - 0884-2374227


తెనాలి - 08644-227600


గూడూరు - 08624-250795;


7815909300


నెల్లూరు - 0861-2345863


ఏలూరు - 08812-232267


బాపట్ల - 08643-222178


భీమవరం టౌన్ - 08816 230098 ;7815909402


సామర్లకోట - 0884-2327010


గుడివాడ - 08674-242454


విజయవాడ - 0866-2571244


తుని - 0885-4252172


రాజమండ్రి - 0883-2420541






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com