శ్రీనగర్ : జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రిగా పిడిపి నేత అల్తాఫ్ బుఖారి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. డిసెంబర్ 19వ తేదీనాటికి గవర్నర్ పాలన విధించి ఆరు నెలలు పూర్తవుతుంది. అప్పటికి ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంది. బిజెపికి వ్యతిరేకంగా పిడిపి, ఎన్సి, కాంగ్రెస్ పార్టీలు కూటమిగా ఏర్పడుతున్నాయి. ఈ కూటమి తరఫున పిడిపి నేత అల్తాఫ్ బుఖారిని ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిగా ఏకాభిప్రాయం కుదిరింది.