బిజెపి ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహుజా సోమవారం పార్టీని వీడారు. నియంతృత్వ వైఖరి అవలంభిస్తున్న కారణంగానే బిజెపి నుండి బయటకు వచ్చేసినట్లు అహుజా పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆళ్వార్ జిల్లాలో రాంగఢ్ నియోజవర్గానికి పార్టీ టికెట్ నిరాకరించడంతో ఆయన పార్టీ నుండి వైదొలిగారు. ఇండిపెండెంట్గా పోటీ చేయనున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఆళ్వార్తో సహా మూడు స్థానాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడంతోనే పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదని సమాచారం. అహుజా బదులుగా సుఖ్వంత్ సింగ్కు ఆ స్థానాన్ని కేటాయించింది.
బిజెపి నియంత్రత్వ పోకడకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని అహుజా అన్నారు. రామ జన్మభూమి, గో రక్షణ, హిందూత్వ వంటి సమస్యలను తీసుకుని ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని అహుజా తెలిపారు. అల్వార్, అజ్మీర్ లోక్సభ ఉప ఎన్నికల్లో ఓడిపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి వసుంధరా రాజేను వ్యాఖ్యానించిన ఓ ఆడియోను అహుజా విన్నారని వినికిడి. జవహార్లాల్ నెహ్రు యూనివర్శిటీలో రోజుకూ పదివేల సిగరెట్ ముక్కలు, 500 అబార్షన్ ఇంజక్షన్లు, 3వేల కండోమ్లు లభ్యమౌతాయని వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.