తెలంగాణ టీడీపీ నేత కోనేరు చిన్ని అమరావతిలో ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. కొత్తగూడెం నుంచి చిన్ని టీడీపీ టికెట్ ను ఆశించారు. అయితే, మహాకూటమి పొత్తులో భాగంగా... ఆ స్థానాన్ని కాంగ్రెస్ కు కేటాయించారు. వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ తరపున బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో, మహాకూటమి అధికారంలోకి రాబోతోందని... రానున్న రోజుల్లో మంచి అవకాశాన్ని కల్పిస్తానని చిన్నికి చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.