ప్రధాని మోడీని జగన్‌, పవన్‌ ఏనాడైనా విమర్శించారా?

  Written by : Suryaa Desk Updated: Sat, Nov 17, 2018, 12:20 PM
 

బీజేపీను పవన్‌ కల్యాణ్‌ వెనకేసుకొస్తున్నారని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీని జగన్‌, పవన్‌ ఏనాడైనా విమర్శించారా? అని ప్రశ్నించారు. పోలవరానికి నిధులు ఇవ్వకపోతే పవన్‌, జగన్‌ నిలదీయరని, రాజధాని నిధులు ఇవ్వని కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించని ఆయన ప్రశ్నించారు. తనపై దాడి జరిగి 19 రోజులైనా జగన్‌ నోరు తెరవలేదన్నారు. బాధితుడే చెప్పకపోతే రాష్ట్రపతికి ఎలా ఫిర్యాదు చేస్తారని ప్రశ్నించారు. విశాఖలో ఫిర్యాదు లేకుండా ఢిల్లిd వెళ్లి రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తారా అని ప్రశ్నించారు. అసెంబ్లిdకి జగన్‌ గైర్హాజరును పవన్‌ ప్రశ్నిస్తే వైసీపీ మౌనంగా ఉందన్నారు. పవన్‌ విమర్శలపై వైసీపీ ఎందుకు స్పందించట్లేదన్నారు. పవన్‌పై విమర్శలు చేయవద్దని వైసీపీను మోడీ, షా శాసించారా? అని ప్రశ్నించారు.