తీరం దాటుతూ తమిళనాడు లో విల‌యం సృష్టించిన గ‌జ‌

  Written by : Suryaa Desk Updated: Sat, Nov 17, 2018, 12:02 PM
 

వేల సంఖ్య లో ఇళ్లు ,చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి .గజ దాటికి తమిళనాడు లో 25 మంది మరణించారు .అసలే తూఫాన్ తో అల్లాడుతున్న తమిళ ప్రజలకు ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అన్నారు వాతావరణ  శాఖ 


అటు కేంద్రం, రాష్ట్రం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. వందలకొద్దీ సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి దాదాపు 81 వేల మందిని శిబిరాలకు తరలించారు. జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్‌) బృందాలు పడవలతో రంగంలోకి దిగి ఉధృతంగా సహాయక చర్యలు చేపడుతున్నాయి. తుపాను విషయమై సీఎం పళనిస్వామితో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. తుపాను కారణంగా జరిగిన నష్టం, సహాయక చర్యల గురించి పళనిస్వామి వివరించారు. తమిళనాడును ఆదుకుంటామనీ, అవసరమైన సాయం చేస్తామని మోదీ హామీనిచ్చారు. కాగా, తమిళనాడు రాష్ట్ర విపత్తు స్పందన దళం తుపానును ఎదుర్కోవడంలో మెరుగ్గా పనిచేస్తోందని ప్రతిపక్ష డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ ప్రశంసించడం గమనార్హం.