షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం

  Written by : Suryaa Desk Updated: Sat, Nov 17, 2018, 11:36 AM
 

అంబాజీపేట మండలంలోని వాకలగరువులో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి వేళ అందరూ  నిద్రిస్తున్న సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదంలో నాలుగు లక్షల మేర నష్టం సంభవించిందని స్థానికులు, బాధితులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని వాకలి గురువు కు చెందిన వాకపల్లి పార్వతి ఇల్లు ప్రమాదానికి గురయింది. ఇదే ఇంట్లో వాకపల్లి వెంకట రామకృష్ణ, దాసరిగంగా రాజేశ్వరి లు కాపురం ఉంటున్నారు. ఈ ప్రమాదంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో అర్ధరాత్రి వేళ భయానక వాతావరణం నెలకొంది. స్థానికులు మంటలను అదుపు చేశారు. బాధితులను మండల వైస్ ఎంపీపీ నిమ్మకాయల చిన్న ,స్థానికులు వాకపల్లి దొరబాబు,ఏడిద నాగబాబు,మద్దింశెట్టి దొరబాబు, తదితరులు పరామర్శించారు.