నేడు ఇంజన్‌ రహిత రైలు ట్రయల్‌ రన్‌

  Written by : Suryaa Desk Updated: Sat, Nov 17, 2018, 11:27 AM
 

న్యూఢిల్లి : ఇంటెగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ తయారు చేసిన ఇంజన్‌ రహిత రైలు ‘ట్రెయిన్‌ 18’ ట్రయల్‌ రన్‌ నేడు జరుగనున్నది. బరైలీ – మొరాదాబాద్‌ సెక్షన్‌లో ఈ రైలు ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తారు. శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ తరువాత తరం రైలుగా రూపొందించిన ఈ రైలును గత నెలలో రైల్వే బోర్డు ఛైర్మన్‌ అశ్వని లోహాని ఆవిష్కరించారు. ఈ రైలు ట్రయల్‌ రన్‌ పర్యవేక్షణ కోసం రీసెర్చ్‌ డిజైన్స్‌ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆర్గనైజేషన్‌ అధికారుల బృందం మొరాదాబాద్‌కు చేరుకుంది. 100 కోట్ల రూపాయిల వ్యయంతో నిర్మించిన ఈ రైలు ప్రత్యేకమైన లోకోమోటివ్‌ లేదా ఇంజన్‌ లేకుండా ప్రయాణిస్తుంది.