ఎమ్మెల్యే చింతమనేని తీరుపై సీఎం సీరియస్

  Written by : Suryaa Desk Updated: Sat, Nov 17, 2018, 09:56 AM
 

ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీరుపై సీఎం చంద్రబాబునాయుడు సీరియస్ అయ్యారు. ఎన్నిసార్లు చెప్పినా చింతమనేని తీరు మారడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఒకరు చేసే తప్పుకు పార్టీకి మొత్తం చెడ్డపేరు వస్తుందని చంద్రబాబు వద్ద పలువురు నేతలు ప్రస్తావించారు. పనిచేస్తేనే సరిపోదని, పద్దతిగా ఉంటేనే పార్టీలో భవిష్యత్ ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చంద్రబాబు హెచ్చరించారు. సహనానికి పరీక్ష పెడితే ఉపేక్షించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు.