నేడు దుర్గగుడి పాలక మండలి సమావేశం

  Written by : Suryaa Desk Updated: Sat, Nov 17, 2018, 09:39 AM
 

విజయవాడ : ఇవాళ విజయవాడలోని కనకదుర్గ గుడి పాలక మండలి సమావేశం కానుంది. మాడపాటి అతిథిగృహంలో ఉదయం 11గంటలకు దుర్గగుడి పాలక మండలి సమావేశం నిర్వహించనున్నారు. దుర్గగుడి శాశ్వత అన్నదాన కేంద్రం నిర్మాణం, అభివృద్ది కార్యక్రమాలపై ప్రధానంగా చర్చ జరుగనుంది.