ఏపీ ప్రభుత్వ ఉత్తర్వుల గురించి సమాచారం లేదు : సీబీఐ

  Written by : Suryaa Desk Updated: Fri, Nov 16, 2018, 06:32 PM
 

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు, దాడులు చేయకుండా ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) స్పందించింది. ఏపీ సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధించి తమ వద్ద ఎటువంటి సమాచారం లేదని పేర్కొంది. ఏపీలో తమ దర్యాప్తునకు ఆంక్షలు విధించే ఆదేశాలు తమకు అందిన తరువాతే స్పందిస్తామని సీబీఐ పేర్కొంది.