భవిష్యత్ లో జలక్రీడలకు విజయవాడ కేంద్రంగా మారుతుంది : సీఎం

  Written by : Suryaa Desk Updated: Fri, Nov 16, 2018, 05:41 PM
 

ఫార్ములా వన్ హెచ్2ఓ బోట్ రేసింగ్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు .సాంస్కృతిక కార్యక్రమం ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడుతూ విజయవాడలో ఈ కార్యక్రమం జరగడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్ లో జలక్రీడలకు విజయవాడ కేంద్రంగా మారుతుందన్నారు.అందమైన నగరం పక్కన సుందరమైన నది ఉండడం ఏపీకి కలిసొచ్చే అంశం అన్నారు. ఏపీలో తొలిసారి బోట్ రేసింగ్ నిర్వహించుకోడం సంతోషంగా ఉందని.. గతంలో హైదరాబాద్ కు తీసుకురావాలనుకున్నా కుదరలేదని.. ఇప్పుడు అంతకంటే మంచి పోటీలు నిర్వహించే అవకాశం కలిగిందన్నారు. 70 నుండి 80 కిమీ నదీ తీరం ఉండడం మన అదృష్టమని పోలవరం పూర్తయితే పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. కృష్ణా నదిలో అందమైన ద్వీపాలున్నాయని.. ప్రపంచ మేటి రాజధాని నిర్మిస్తామని, ఇప్పటికే 35 వేలకోట్లతో రాజధాని పనులు జరుగుతున్నాయన్నారు. ప్రపంచంలోనే అగ్రగామి రాజధానిగా అమరావతి నిలవబోతుందని.. అద్భుతమైన డిజైన్లతో భవనాలు వస్తున్నాయన్నారు. హైకోర్టు భవనం ఐకానిక్ గా నిలవబోతుందన్నారు.