ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు భారత్ మొట్టమొదటి ఇంజిన్ లెస్ రైలు ట్రైన్ 18 ట్రయల్ రన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 16, 2018, 03:12 PM

మొరాదాబాద్: భారత్ మొట్టమొదటి ఇంజిన్ లెస్ రైలు ట్రైన్ 18కు అధికారులు రేపు తొలిసారిగా ట్రయల్ రన్‌ను నిర్వహించనున్నారు. బరేలీ-మొరాదాబాద్ రైల్వే లైన్లో ఈ ట్రయల్ రన్‌ను చేపట్టనున్నారు. ట్రయల్ రన్ కోసం రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్(ఆర్‌డీఎస్‌ఓ) టీం ఇప్పటికే మొరాదాబాద్‌కు చేరుకుంది. 16 కోచ్‌లను కలిగి ఉన్న ఈ రైలు నిర్మాణానికి రూ. 100 కోట్లు ఖర్చు చేశారు. 80 శాతం భారతీయ సాంకేతిక నైపుణ్యంతో రూపొందించిన ఈ రైలు గంటలకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని అధికారులు తెలిపారు. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలును ఈ ఇంజిన్‌లెస్ ట్రైన్ రీప్లేస్ చేయనుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com