మాజీ డీజీ దినేష్ రెడ్డి మీద ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య ఘాటు విమర్శలు చేశారు. ఏపీలో శాంతి బధ్రతలు క్షీణించాయని ధినేష్ రెడ్డి వ్యాఖ్యానించడం సరికాదన్న వర్ల శాంతిబద్రతలు గాడి తప్పాయని దినేష్ ఏ ప్రాతిపదికన చెప్పారని.. అవగాహన లేకుండా మాట్లాడవద్దన్నారు. బిజెపిలో చేరిన మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అత్యంత హేయనీయమని.. జగన్ కోడి కత్తి డ్రామాలో తెలంగాణా పోలీసులైతే సరే ఎపి పోలీసులు మాత్రం వద్దని జగన్ చెప్పవచ్చా ధినేష్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. బిజెపి అధికారం ఉన్న రాష్ట్రాల్లో దళితులపై దాడులు జరుగుతుండడం వాస్తవం కాదా అన్న ఆయన డిజిగా పనిచేసిన ధినేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు.