ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెల్లూరులో పోలీసుల ఉచిత మెగా వైద్య శిబిరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 19, 2018, 04:22 PM

  నెల్లూరు : పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా.. శుక్రవారం నెల్లూరు పోలీస్‌ హాస్పటల్‌లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నెల్లూరు నగర సబ్‌ డివిజన్‌, డిపిఎంపి అసోయేషన్‌ ఆఫ్‌ ఇండియా వారు సంయుక్తంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని అడిషనల్‌ ఎస్పీ అడ్మిన్‌వన్‌ ప్రారంభించారు. అనంతరం అడిషనల్‌ ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసుల అమరవీరులను, వారి త్యాగాలను స్మరిస్తూ.. ప్రసంగించారు. పోలీసులతో పాటు శిబిరానికి విచ్చేసిన పోలీసుల కుటుంబాలు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషినల్‌ ఎస్పీ క్రైమ్‌ ఆంజనేయులు, అడిషినల్‌ ఎస్పీ ఎఆర్‌ వీరభద్రుడు, టౌన్‌ డీఎస్పీ మురళీకృష్ణ, ఎఆర్‌ డిఎస్పీ చంద్రశేఖర్‌, పోలీస్‌ సంఘం అధ్యక్షులు ప్రసాదరావు, స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు నాయుడు, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com