నెల్లూరు: జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీకి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వెంకటపతి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన వెంటే బోగోలు జెడ్పీటీసీ బాపట్ల కామేశ్వరి, మరికొందరు నేతలు రాజీనామా చేశారు. కాసేపట్లో మంత్రులు సోమిరెడ్డి, నారాయణ, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకోనున్నారు.