దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ గౌరంగబాబుకు చేదు అనుభవం

  Written by : Suryaa Desk Updated: Tue, Oct 16, 2018, 03:59 PM
 

విజయవాడ : దుర్గగుడి పాలక మండలి ఛైర్మన్ గౌరంగబాబుకు చేదు అనుభవం ఎదురైంది. కుటుంబ సభ్యులతో కలిసి గౌరంగబాబు అమ్మవారి దర్శనానికి వచ్చారు. దర్శనానికి వెళ్తుండగా ఈవో కోటేశ్వరమ్మ, వీఐఫీ క్యూలైన్ లో వెళ్లాలని సూచించారు. ఈవో కోటేశ్వరమ్మ వైఖరితో ఛైర్మన్ గౌరంగబాబు అలకబూనారు. ఛైర్మన్ హోదాలో దర్శనానికి తీసుకువస్తే ఆపేస్తారా అంటూ ఆవేదన చెందారు. ఈవో ఛైర్మన్ కు సర్దిచెప్పి కుటుంబ సభ్యులను దర్శనానికి పంపారు.