సుప్రీం తీర్పునకు వ్యతిరేకంగా ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ

  Written by : Suryaa Desk Updated: Tue, Oct 16, 2018, 03:40 PM
 

కేరళ : శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కేరళకు చెందిన ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది చెట్టుకు ఉరి వేసుకోవడానికి ఆమె ప్రయత్నించింది. అక్కడ ఉన్నవారు ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అయ్యప్ప స్వామి ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతించడాన్ని స్థానిక మహిళలు వ్యతిరేకిస్తున్నారు. అనాదిగా వస్తున్న ఆలయ సంప్రదాయాలను, ఆచారాలను గౌరవించాల్సిందేనని స్థానిక మహిళలు పేర్కొంటున్నారు.