సత్లోక్‌ ఆశ్రమం అధిపతి రామ్‌పాల్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధింపు

  Written by : Suryaa Desk Updated: Tue, Oct 16, 2018, 03:00 PM
 

హర్యానా : స్వయం ప్రకటిత దైవాంశ సంభూతుడు, సత్లోక్‌ ఆశ్రమం అధిపతి రామ్‌పాల్‌కు ఒక హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ హిస్సార్‌లోని కోర్టు తీర్పు చెప్పింది. నలుగురు మహిళలు, ఒక చిన్నారి మృతులకు సంబంధించిన 2014 నాటి హత్య కేసులో రామ్‌పాల్‌కు యావజ్జీవ కారాగారవాసం విధించారు. ఈ కేసుతో ప్రమేయం ఉన్న రామ్‌పాల్‌ కుమారుడు విజేందర్‌, మరొక 13 మందికి కూడా యావజ్జీవ కారాగారవాసం విధించారు. ప్రతి ఒక్క దోషిపై లక్ష రూపాయిల జరిమానా కూడా విధించారు. తీర్పు సందర్భంగా హిస్సార్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.