జేడీయూ ఉపాధ్యక్షుడిగా ప్రశాంత్ కిషోర్

  Written by : Suryaa Desk Updated: Tue, Oct 16, 2018, 02:19 PM
 

పాట్నా : రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో జేడీయూ(జనతాదళ్ యునైటెడ్)లో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఇవాళ ప్రశాంత్ కిషోర్‌ను జేడీయూ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రశాంత్ కిషోర్‌కు జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. 2019 ఎన్నికల్లో తమ పార్టీల తరపున పోటీ చేయాలని బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఆఫర్లు వచ్చినా వాటిని ప్రశాంత్ తిరస్కరించారు. సొంత రాష్ట్రంలో రాజకీయ నేతగా ఎదగాలని నిర్ణయించుకున్న ప్రశాంత్ కిషోర్.. గత నెలలో జేడీయూలో చేరారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 40 స్థానాల్లో గెలవాలన్న లక్ష్యంగా పని చేస్తున్న జేడీయూకి ప్రశాంత్ చేరిక కొంత బలాన్నిచ్చినైట్లెంది.