ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువగళం పాదయాత్ర చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 07, 2023, 02:49 PM

వైయ‌స్ఆర్ జిల్లాలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అయ్యింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ మైదుకూరు ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి పేర్కొన్నారు. బుధ‌వారం క‌డ‌ప న‌గ‌రంలో మేయ‌ర్ సురేష్‌బాబుతో క‌లిసి ర‌ఘురామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతులకు, ప్రజలకు లోకేష్ పాదయాత్ర గుదిబండగా తయారైంద‌న్నారు. ప్ర‌తి చోట విసిరి వేస్తే పక్క ప్రాంతానికి ఎగిరి పడుతున్నాడు..యువగళం పాదయాత్ర చూసి ప్రజలు నవ్వుకుంటున్నార‌ని చెప్పారు. కేవలం గంటన్న‌ర‌లో పాదయాత్ర పూర్తి చేసిన ఘనత లోకేష్‌కే ద‌క్కుతుంద‌ని ఎద్దేవా చేశారు. ప్రజలు లేక పాదయాత్ర పూర్తి చేసుకుని నిద్ర పోయాడ‌ని, వైయ‌స్ జగన్ పాదయాత్ర కు లోకేష్ పాదయాత్ర కు నక్కకు నాగ లోకానికి ఉన్న తేడా ఉంద‌ని అభివ‌ర్ణించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com