ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంపీ విజయసాయిరెడ్డి అధ్యక్షతన వైయ‌స్ఆర్ సిపి అనుబంధ విభాగాల సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 07, 2023, 02:46 PM

ప్రతి పక్షంలో ఉన్నప్పుడు 2019 ఎన్నికలకు ముందు వైయ‌స్ఆర్‌సీపీ గెలుపు కోసం అనుబంధ విభాగాలు ఎలా పని చేశాయో...అలాగే 2024 గెలుపు కోసం సమ‌ష్టిగా పనిచేయాలని  వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి పిలుపునిచ్చారు..పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్ఠతకు కృషి చేయాలన్నారు.  తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో  పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అనుబంధ విభాగాల ఇంచార్జ్  విజయసాయిరెడ్డి  అధ్యక్షతన మంగళవారం అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశం జరిగింది. ముందుగా ఇటివల ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో  మృతిచెందిన వారికి ఈ సమావేశంలో నివాళులు అర్పించారు.   






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com