ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముసునూరులో బిజెపి కార్యకర్తలు సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 29, 2023, 11:03 AM

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు , ఏలూరు జిల్లా అధ్యక్షులు కోరళ్ళ జ్యోతి సుధాకర్ కృష్ణ , ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ తపన చౌదరి ఆదేశం మేరకు మోడీ తొమ్మిది సంవత్సరాల పరిపాలన, బడుగు బలహీన వర్గాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సంక్షేమ పథకాలు అందేలాగా, ప్రతి ఇంటికి వెళ్లి బిజెపి కార్యకర్తలు వారికి ఏ సమస్య ఉన్న అడిగి మరీ ఆ సమస్య తీర్చి కేంద్ర ప్రభుత్వ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ ముసునూరు మండల నాయకులు ఆదివారం కోరారు. ముసునూరు ఆర్ఎంపీ వైద్యులు గుడివాడ వెంకటేశ్వరరావు స్వగృహం లో బిజెపి కార్యకర్తల సమావేశం వాడి వేడిగా సాగింది. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షులు అనగని రాంబాబు అధ్యక్షతన నూజివీడు నియోజకవర్గ ప్రచార కమిటీ ఇంచార్జ్ జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శిచేశారు దొడ్డ నాగరాజు , నూజివీడు నియోజకవర్గం కన్వీనర్ వాసు మాస్టర్ , జనరల్ సెక్రెటరీ గద్దల ఆశీర్వాదం, మండల వైస్ ప్రెసిడెంట్ గుడివాడ వెంకటేశ్వరరావు , మండల మహిళా మోర్చా అధ్యక్షులు పోలగాని రామలక్ష్మి , బిజెపి నాయకులు ఆరేళ్ల నాగయ్య, రామకోటేశ్వర , మరిది కోటయ్య , పామర్తి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com