ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికలకు సిద్దంగా ఉన్నాం: డీకే శివకుమార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 29, 2023, 09:04 PM

కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్దంగా ఉందని కర్ణాక పీసీసీ చీఫ్ డీ.కే. శివకుమార్ అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. మే 10న కర్ణాటక శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మాట్లాడుతూ... ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎంత తొందరగా ఇక్కడున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపితే ఈ రాష్ట్రానికి, దేశానికి మంచిదని తెలిపారు. 


అవినీతి నుంచి రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడే ఎన్నికలుగా ఈ ఎన్నికలను శివకుమార్ అభివర్ణించారు. దేశంలో అవినీతి పతాక స్థాయికి చేరిందని... అవినీతిని ప్రధాని మోదీనే ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. అవినీతికి పాల్పడుతున్న సొంత పార్టీ నేతలపై మోదీ చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఎంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేస్తే దేశానికి, రాష్ట్రానికి అంత మంచిదని అన్నారు.SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com