నంద్యాల పట్టణంలోని రోటరీ భవన్లో చెన్నకేశవ అనే అబ్బాయికి 20వేల విలువగల చెవిటి మిషన్ ను పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ. క్లబ్ ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే తన చేతనైనంత సహాయం వారికి చేశారని తెలిపారు. అధ్యక్షులు డా. అనిల్ కుమార్, న్యాయవాదులు వివేకానంద రెడ్డి, జయకృష్ణ, సభ్యులు పాల్గొన్నారు.