వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబుతో అసెంబ్లీలో ఎమ్మెల్యే స్వామిపై దాడి చేయించారని నక్కా ఆనందబాబు అన్నారు. శాసనసభలో ఎమ్మెల్యేలపై దాడికి సీఎం జగన్ రెడ్డి సిగ్గు పడాలన్నారు. వైసీపీ పని అయిపోయిందని, అందుకే సహానం కోల్పోతున్నారన్నారు. దాడి చేసిన వారు భవిష్యత్తులో అంతకు అంత అనుభవిస్తారని... ఎవ్వరిని వదిలి పెట్టమని నక్కా ఆనందబాబు హెచ్చరించారు.