సొంత పార్టీ తన ఫోన్ ట్యాప్ చేసిందని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసారు.ఈ విషయంపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందిస్తూ.. తమ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇలాంటి పనులు చేయడం చంద్రబాబుకు అలవాటేనని అన్నారు. జగన్ వల్లే తనకు పదవి వచ్చిందని కోటంరెడ్డి చాలాసార్లు చెప్పారు.కోటంరెడ్డికి చంద్రబాబు మంత్రి పదవి ఆఫర్ చేసినట్టున్నారని... పార్టీ మారాలనుకున్నారు కాబట్టే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. జగన్‌కు నమ్మకం తప్ప అనుమానాలు ఉండవని అన్నారు.
![]() |
![]() |