బిగ్ బాస్ రియాల్టీ షో పై అభ్యంతరం ఉంటే చూడవద్దని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ షో పై దాఖలైన పిటిషన్ పై కోర్టు విచారణ జరిపింది. ఎవరు ఏం చూడాలో చెప్పే పని కోర్టులది కాదని పేర్కొంది. ప్రసారాలపై అభ్యంతరాలుంటే హైకోర్టును ఆశ్రయించకుండా వేరే ప్రత్యామ్నయ మార్గాలు ఉన్నాయని స్టార్ మా తెలిపింది. దీంతో ఆ వివరాలను కౌంటర్ రూపంలో కోర్టుకు తెలపాలని ఆదేశిస్తూ విచారణ ఆరు వారాలు వాయిదా వేసింది.