ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభివృద్ధి పనులకు శ్రీకారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 29, 2022, 11:46 AM

చెన్నూరు కొత్త రోడ్డు నుంచి పాత రోడ్డు వరకు, రోడ్డు వెడల్పులో భాగంగా దాదాపు కోటి రూపాయలతో ఆ పనులకు శ్రీకారం చుట్టామని కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్‌ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం చింతకొమ్మదిన్నె జడ్‌పిటిసి నరేన్‌ రామాంజులరెడ్డితో కలసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ మండల అభివృద్ధిలో భాగంగా కొత్త రోడ్డు నుంచి రామాలయం వరకు రూ. 34 లక్షలతో సిసి రోడ్లను నిర్మించనున్నామని చెప్పారు. రూ. 64 లక్షలతో చెన్నూరు కొత్త రోడ్డు నుంచి వనం వీధి వరకు డ్రెయినేజీ పనులు చేపట్టామని పేర్కొన్నారు. పనులన్నీ పూర్తయితే ప్రజలకు డ్రెయినేజీ సమస్యతోపాటు రోడ్లపై ఎక్కడా వర్షపు నీరు నిల్వ ఉండదని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com