ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీఎస్ ఆర్టీసీలో యూపీఐ పేమెంట్లకు మార్గం సుగుమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 07, 2022, 11:23 PM

యూపీఐ పేమెంట్లు వచ్చాక వినియోగదార్లకు బాగా సౌకర్యం ఏర్పడింది. దీంతో ఈ సేవలకు ఏపీఎస్ ఆర్టీసీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇదిలావుంటే ప్ర‌యాణికుల‌కు మెరుగైన సేవ‌లు అందించ‌డంలో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) స‌త్తా చాటుతోంది. ద‌స‌రాకు అవ‌స‌ర‌మైన‌న్ని ప్ర‌త్యేక బస్సులు ఏర్పాటు చేసిన ఆ సంస్థ‌.. వాటిలో గ‌తంలో మాదిరిగా అద‌న‌పు చార్జీల‌ను వ‌సూలు చేయ‌లేదు. తాజాగా ప్ర‌యాణికుల‌కు మ‌రో సుల‌భ‌త‌ర వెసులుబాటును క‌ల్పిస్తూ ఏపీఎస్ఆర్టీసీ శుక్ర‌వారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. బ‌స్సుల్లో డిజిట‌ల్ చెల్లింపుల‌తో టికెట్ల‌ను విక్ర‌యించేందుకు ఆ సంస్థ తీర్మానించింది. 


బ‌స్సులో టికెట్‌కు చెల్లించాల్సిన సొమ్మును ప్ర‌యాణికులు యూపీఐ పేమెంట్ల ద్వారా చెల్లించేలా ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ కొత్త త‌ర‌హా వెసులుబాటును తొలుత విశాఖ నుంచి న‌డిచే 97 స‌ర్వీసుల్లో అందుబాటులోకి తీసుకురానుంది. ద‌ళ‌ల వారీగా అన్ని బ‌స్సుల్లోనూ యూపీఐ చెల్లింపుల‌ను అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు ఆ సంస్థ తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com